మాజీ ప్రధాని కుమార్తె, అల్లుడికి బెయిల్‌ | Sakshi
Sakshi News home page

పనామా కేసు: నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె, అల్లుడుకు బెయిల్‌

Published Mon, Oct 9 2017 5:25 PM

Nawaz Sharif's daughter, son-in-law  got bail 

ఇస్లామాబాద్‌: పనామా పత్రాల కేసులో పాక్‌ ప్రధానిగా వైదొలగిన నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె, అల్లుడుకి బెయిల్‌ లభించింది. అయితే అవినీతి కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు ఎదుట నవాజ్‌ షరీఫ్‌ హాజరు కాలేదు.కోర్టు ఎదుట హాజరయ్యేందుకు మార్యం నవాజ్‌ (43) తన భర్త, మాజీ ఆర్మీ కెప్టెన్‌ మహ్మద్‌ సఫ్దర్‌తో కలిసి ఇస్లామాబాద్‌కు తిరిగివచ్చారు. కోర్టుకు చేరుకున్న వెంటనే ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ కావడంతో సప్ధర్‌ను అరెస్ట్‌ చేశారు.

కేసుకు సంబంధించి వారు ఇరువురూ అకౌంటబిలిటీ కోర్టు న్యాయమూర్తి మహ్మద్‌ బషీర్‌ ఎదుట వేర్వేరుగా హాజరయ్యారు.విచారణ సందర్భంగా నవాజ్‌ షరీఫ్‌ ఆయన ఇద్దరు కుమారులు గైర్హాజరయ్యారు. గొంతు క్యాన్సర్‌తో నవాజ్‌ భార్య బాధపడుతున్నక్రమంలో వారు లండన్‌లో ఉన్నారు. గతంలో జరిగిన రెండు విచారణలకు హాజరైన నవాజ్‌ షరీఫ్‌ సర్జరీ జరుగుతున్న క్రమంలో భార్యను చూసేందుకు గత వారం లండన్‌కు చేరుకున్నారు. కాగా పనామా పత్రాల కేసులో మార్యం, సఫ్దర్‌లు దాఖలు చేసిన బెయిల్‌ దరఖాస్తులను అంగీకరించిన కోర్టు అక్టోబర్‌ 13 వరకూ విచారణను వాయిదా వేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement